RRR టీమ్…అవుట్ ఆఫ్ టౌన్

RRR Movie
RRR Movie

RRR సినిమా మొదలుపెట్టడానికి కాస్త టైం తీసుకున్న జక్కన్న మొదలుపెట్టాక మాత్రం అస్సలు ఆలస్యం చెయ్యట్లేదు.నాన్ స్టాప్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు.బౌండెడ్ స్క్రిప్ట్ లేదు అన్న మాటలన్నీ పుకార్లే అని తేల్చేస్తూ గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో అదరగొట్టేస్తున్నారు.ఇప్పటికే ఇక్కడ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న RRR మూడో భారీ షెడ్యూల్ కోసం కోల్ కతా వెళుతుంది.

నాన్ స్టాప్ గా నలభై రోజులకు పైగా సాగే ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ అండ్ చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తారు.ఆ షూటింగ్ ఎక్కువభాగం హౌరా బ్రిడ్జి మీద జరపబోతున్నారు.ఈ సినిమా ప్రీ ఇండిపెండెన్స్ డే మోడ్ లో నడుస్తుంది….ఆ టైం లో కోల్ కత్తా లో ఆందోళనలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది.అందుకే సినిమాకి కీలకమయిన షెడ్యూల్ ని అక్కడ ప్లాన్ చేసారు.

ఇక మరో పక్క ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ ని ఫైనల్ చేసుకున్నారు.కానీ ఆమె రెమ్యునరేషన్,షెడ్యూల్స్ వంటి విషయాలు మాత్రం రాజమౌళి తనయుడు కార్తికేయ చూస్తున్నట్టు తెలుస్తుంది.ఆ రెండిటిలో ఏ ఒక్కటి సెట్ కాకపోయినా కూడా పరిణీతో చోప్రా ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది.ఇదే స్పీడ్ లో షూటింగ్ జరిగితే మాత్రం 2020 సమ్మర్ లో RRR అనే అద్భుతం వెండితెరపై ఆవిష్కృతమవుతుంది.