RRR నుండి కీలక విషయం లీక్

RRR
RRR

RRR …ఈ సినిమా సెట్ అవ్వడమే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.టాలీవుడ్ లో ఇద్దరు స్టార్స్ హీరోస్ నటిస్తుండడం,బాహుబలి లాంటి ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ ని డైరెక్ట్ చేసిన రాజమౌళి డైరెక్ట్ చేస్తుండడం వల్ల ఈ సినిమాగురించి టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అంతా వెయిటింగ్.

అంత వెయిట్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టే ఈ సినిమాగురించి ఏ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కావట్లేదు రాజమౌళి.అన్నీ పక్కాగా చూసుకుని మరీ సెట్స్ మీదకి వెళ్లి అప్పుడే ఒక లాంగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు. RRR అంటే రాజమౌళి,రామారావు,రాంచరణ్ అనే కాల్ర్టీ మాత్రమే అందరికి ఉంది.రామరావణ రాజ్యం,రామరాజ్యంలో రావణుడు ఈ సినిమా టైటిల్స్ అనేవి ఊహాగానాలు మాత్రమే.అయితే ఈ సినిమాకి జరుగుతున్న కీలకమయిన సెకండ్ షెడ్యూల్ నుండి కొన్ని గూస్ బంప్స్ విషయాలు బయటికి వచ్చాయి.

ఈ సినిమా పూర్తిగా 1940 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ పేరు రామరాజు అని తెలుస్తుంది. RRR లో ఒక ఆర్ సీక్రెట్ రివీల్ అయిపోయింది.అనంగపూర్ పోలీస్ స్టేషన్ అనే సెట్ వేసి చరణ్ సోలో సీన్స్ షూట్ చేస్తున్నారు.వెయ్యిమంది తో చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.ఈ సినిమాకి సినిమాకి హైలైట్ గా మారుతుంది అని వేరే చెప్పక్కర్లేదు.

ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేసేలా డిజైన్ చేసారు అని టాక్.నెక్స్ట్ షెడ్యూల్ లో చరణ్ కి రెస్ట్ ఇచ్చి ఆ సీన్స్ తెరకెక్కిస్తారు.అసలు ఈ సినిమాకి సంబందించిన విషయాలు,విశేషాలు వింటుంటే ఎవరికయినా can’t వెయిట్ టు వాచ్ అనే అనిపిస్తుంది.కానీ 2020 వరకు వెయిట్ చెయ్యకతప్పదు మరి.