RRR లో విలన్ ఎవరు?

RRR Movie
RRR Movie

RRR ….400 కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్ పై ఇండియా వైడ్ గా ప్రేక్షకుల్లో ఎలాంటి అతిభారీ అంచనాలు ఉన్నాయి అనేది అందరికి తెలిసినవిషయమే.అయితే ఈ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి ఎవ్వరూ ఊహించని విధంగా చాలా విషయాలు రివీల్ చేసిన రాజమౌళి ఎన్నో ప్రశ్నలు కూడా మిగిల్చాడు.అందులో అతి ముఖ్యమైనది RRR లో విలన్ ఎవరు అనేది?.

ఆజాను దేవగన్ ని ఈ సినిమాలోకి తీసుకుంటున్నారు అనగానే ట్రెండ్ ని కొనసాగిస్తూ అతన్నే విలన్ గా చూపిస్తాడు రాజమౌళి అనుకున్నారు.కానీ అతను విలన్ కాదు అని క్లారిటీ ఇచ్చేసాడు జక్కన్న.పైగా RRR లో అజయ్ దేవగన్ కనిపించేది కేవలం 30 నిముషాలు మాత్రమే అనే టాక్ కూడా ఉంది.

అయితే ఈ సినిమాలో విలన్ గా కొత్త వ్యక్తిని చూపించాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడట.సై సినిమాతో ప్రదీప్ రావత్,ఛత్రపతిలో సుప్రీత్,మగధీర లో దేవ్ గిల్,మర్యాద రామన్న లో నాగినీడు,ప్రభాకర్ లాంటి వాళ్ళను విలన్స్ గా చూపించి అందరికి బ్రేక్ ఇచ్చాడు.

ఇక ఈగ తో కన్నడ స్టార్ హీరో సుదీప్ ని,బాహుబలి తో తెలుగు హీరో రానా ని కూడా భయంకరమైన విలన్స్ గా ఎస్టాబ్లిష్ చేసాడు.సో,రాజమౌళి సినిమాలో ఒక్కసారి విలన్ గా కనిపిస్తే చాలా అతను ఆల్మోస్ట్ టాలీవుడ్ లో సెటిల్ అయిపోయినట్టే.మరి RRR కి ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.