RRR రిలీజ్ డేట్ ఇదే

RRR movie
RRR movie

RRR గురించి ఆ సినిమా టీమ్ ప్రెస్ మీట్ పెడుతుంది అంటే చాలామంది అది జస్ట్ మీడియా కి అలక రాకుండా అంటూ ఏవేవో రాసుకొచ్చారు.కానీ సినిమాలో హీరోల పాత్రలు,సినిమా ప్లాట్,సినిమా హీరోయిన్స్,సినిమా బడ్జెట్ మాత్రమే కాదు సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు రాజమౌళి అండ్ టీమ్.అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది అనే దగ్గర్నుండి ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఏంటి అనేంత వరకు టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.

అయితే ఈ ప్రెస్ మీట్ లో అంతా క్లాప్స్ కొట్టే ఒక అనౌన్స్ మెంట్ ఈ సినిమా నిర్మాత దానయ్య చేశారు.అదే ఈ సినిమా రిలీజ్ డేట్.ఇప్పటివరకు కేవలం 20 పెర్సెంట్ షూటింగ్ జరుపుకున్న మాసివ్ మల్టీస్టారర్ ని 2020 జులై 30 న రిలీజ్ చెయ్యబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేసారు.దీంతో అంతా క్లాప్స్ కొట్టారు.పాన్ ఇండియా సినిమా అయినా RRR గురించి ముందుగా రాజమౌళి ఇలా తెలుగుమీడియా తో ఇంటరాక్ట్ అయ్యి అన్ని విషయాలు రివీల్ చెయ్యడంతో అంతా అతన్ని అలానే సినిమా టీమ్ ని అభినందిస్తున్నారు.

ఇక ఈ ప్రెస్ మీట్ లో ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్క ప్రశ్న ని దాటవెయ్యకుండా క్లియర్ కట్ ఆన్సర్స్ ఇవ్వడం బావుంది.అలానే ఇప్పటివరకు ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్న ప్రశ్నకి కూడా సమాధానం ఇచ్చేసారు.350 నుండి 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

బాహుబలి టైం లో కాస్త నెర్వస్ గా కనిపించిన రాజమౌళి ఈ ప్రెస్ మీట్ లో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు.బహుశా బాహుబలి:2 తాలూకు విజయం జక్కన్న కాఫిడెన్స్ కి కారణం అయ్యి ఉండొచ్చు.మొత్తానికి RRR ప్రెస్ మీట్ అందరి అంచనాలను మించి ఇంట్రెస్టింగ్ గా సాగి సూపర్ హిట్ అయ్యింది.