RRR రాజమౌళి ప్రెస్ మీట్ డీటెయిల్స్

RRR Movie
RRR Movie

బాహుబలి అనే వరల్డ్ క్లాస్ బ్లాక్ బస్టర్ ని డైరెక్ట్ చేసిన రాజమౌళి  ఇప్పడు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లతో RRR అనే సినిమా తెరెకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అయితే బాహుబలి టైం లో రాజమౌళి విజన్ మాత్రమే కాదు అతని ఆలోచనల స్టాండర్డ్,సినిమాలను ప్రోమోట్ చేసే పద్ధతి అన్నీ కూడా మారాయి.

ఇంతకుముందు సినిమా కంప్లీట్ అయ్యేవరకు అసలు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని జక్కన్న ఇప్పుడు మాత్రం రూట్ మార్చుకున్నాడు.RRR పై భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఆ సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా ఆ అంచనాలు అలానే కంటిన్యూ చెయ్యడం కరెక్ట్ కాదు అని ఫిక్స్ అయ్యాడు.ఇప్పటికే RRR పాన్ ఇండియా మూవీ అని అఫీషియల్ గా రివీల్ చేసిన జక్కన్న RRR ప్రెస్ మీట్ లో మరిన్ని విషయాలు రివీల్ చెయ్యబోతున్నాడు.అయితే ఆ విషయాలు హీరోయిన్స్ గురించా?,సినిమా నెక్స్ట్ షెడ్యూల్స్ గురించా?,లేక ఇప్పటివరకు పూర్తయిన షూటింగ్ వివరాలు వెల్లడిస్తాడా?,లేక సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తాడా అని అంతా గెస్సింగ్ మోడ్ లో ఉన్నారు.

అయితే ఇప్పటికే RRR పై చాలా రూమర్స్ వచ్చాయి.వీటి గురించి రిపోర్టర్స్ ప్రశ్నలు సాధిస్తే రాజమౌళి ఇచ్చే ఆన్సర్స్ పై కూడా చాలా క్యూరియాసిటీ నెలకొంది.నిజానికి ఇలా మిడ్ ప్రొడక్షన్ ప్రెస్ మీట్ అనే కల్చర్ బాలీవుడ్ లో కనిపిస్తుంది.ఇప్పడు జక్కన్న తీస్తుంది నేషనల్ మూవీ కాబట్టి అదే ఫార్మాట్ ని ఫాలో అవుతున్నాడు.ఇక రాజమౌళి తో పాటు ఎన్టీఆర్,రామ్ చరణ్ లు కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నారు.దీంతో ఈ సినిమాకి వాళ్ళ మేకోవర్ అనే విషయం లో కూడా పూర్తిగా క్లారిటీ వస్తుంది.త్వరలో భారీ షెడ్యూల్ కోసం కలకత్తా కి వేకుతుంది RRR యూనిట్.