RRR పై సరికొత్త రూమర్

RRR Movie
RRR Movie

వరల్డ్ బ్లాక్ బస్టర్ తీసిన రాజమౌళి డైరెక్షన్,టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోస్ కాంబో,300 కోట్ల టెంటేటివ్ బడ్జెట్,ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ కి సంబందించిన యూనివర్సల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్…..ఇవీ RRR సినిమాకి ఉన్న తిరుగులేని ట్యాగ్స్.వీటివల్ల ఈ సినిమాపై రోజుకొక కొత్త స్టోరీ పుట్టుకొస్తుంది.ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు.ఎవరికి నచ్చిన రూమర్ వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు.

అయితే ఇప్పుడు RRR పై వచ్చిన రూమర్ వింటే ఫ్యాన్స్ కి ఆనందం,మిగతావాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది.అదేంటంటే RRR ఓవర్సీస్ రైట్స్ 75 కోట్లు అని.ఇది నిజం అయ్యే ఛాన్స్ అయితే అస్సలు లేదు.నిజానికి సినిమా టైం ఈ రేట్ రేంజ్ కి ఇంకా పెరిగినా పెరగొచ్చు.అందుకే ఈ సినిమా విషయంలో దానయ్య మాత్రం అస్సలు తొందరపడట్లేదు.

అందుకే వినయ విధేయ రామ నష్టాలను కూడా ముందే భర్తీ చేసేసాడు.300 కోట్లు ఈ ప్రాజెక్ట్ కి పెడుతున్న బడ్జెట్.అంటే మినిమమ్ బిజినెస్ 500 కోట్లు.అలాంటపుడు దానయ్య తొందరపడాల్సిన అవసరం ఏముంది?.ఇక రాజమౌళి కి చెప్పకుండా బిజినెస్ విషయంలో కూడా ఏ నిర్ణయం తీసుకునే ప్రసక్తే లేదు.ఇప్పడు జక్కన్నకి అంత టైం లేదు.

అందుకే RRR పై రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు.అల్యూమినియం ఫ్యాక్టరీ షెడ్యూల్ అయ్యి రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాక కొన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది.అప్పటివరకు గాసిప్ స్టార్స్ కి ఫుల్ మెటీరియల్ చేతిలో ఉన్నట్టే.