ఫ‌లితాల వెల్ల‌డిలో ఆర్వోదే తుది నిర్ణయం – సీఈవో ర‌జ‌త్ కుమార్

Cec Rajath Kumar
Cec Rajath Kumar

ఫలితాల వెల్లడిలో రిటర్నింగ్‌ అధికారులదే తుది నిర్ణయమని, ఈసీ జోక్యం చేసుకోదన్నారు తెలంగాణ సీఈవో రజత్‌ కుమార్ ఓట్ల లెక్కింపు నిర్వహణపై సీఈవో రజత్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుందన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అవుతుంద‌న్నారు. . 17 లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నార‌ని వివ‌రించారు. రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 126 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో 7, సికింద్రాబాద్‌లో 6 సెగ్మెంట్లలో లెక్కింపు ఉంటుందన్నారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఉంటాయన్నారు. నిజామాబాద్ పరిధిలో ప్రతి అసెంబ్లీ స్థానంలో 2 హాళ్లు, 36 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు ఆయ‌న వివ‌రించారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో లాటరీ పద్దతిలో 5 వీవీప్యాట్ల ఎంపిక జరుగుతుందన్నారు. వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎంలకు ఇప్పటివరకు తేడా రాలేదన్నారు. ఈవీఎంలు, 17సీలో సమానంగా వచ్చి వీవీప్యాట్ స్లిప్పులో తేడా వస్తే మరోసారి స్లిప్పుల లెక్కింపు చేపడతారన్నారు.