బిజేపి – వైసిపి కుట్రతోనే చంద్రగిరి రీ పోలింగ్

Elections
Elections

ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించిందంటే .. కేవలం BJP , YCP కుట్రేనని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…పోలింగ్‌ సమయంలో కొన్ని చోట్ల ఈవీఎంల మరమ్మతుల కోసం 6 గంటల సమయం తీసుకున్నారని, ఒక EVM స్థానంలో కొత్తది ఏర్పాటు చేయడానికి అంత సమయం అవసరమా అని ఆయ‌న ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని జగన్‌ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారన్నారు. బిహార్‌ ప్రశాంత్‌ కిశోర్‌, జగన్‌, విజయసాయిరెడ్డి పాపాలు బయటకు రావాల్సిన అవసరముందన్నారు.