టాలీవుడ్ రీమేక్ రాజా శర్వా

Hero Sharwanand
Hero Sharwanand

నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి వైవిధ్యమయిన సినిమాలే చేసినా కూడా శర్వానంద్ కి రావాల్సినంత గుర్తింపు రాలేదు.వెన్నెల,ప్రస్థానం లాంటి సినిమాల్లో సీరియస్ పాత్రలు చెయ్యడంతో అతనికి అనుకోకుండ ఒక బ్యాండ్ క్రియేట్ అయిపొయింది.కానీ రన్ రాజా రన్ సినిమాతో శర్వా కెరీర్ పూర్తిగా మారిపోయింది.అతనిలోని కామెడీ టైమింగ్ చూసి అంతా ఆశ్చర్యపోయారు.

ఆ తరువాత కూడా యూత్ ఫుల్ రెఫ్రెషింగ్ లవ్ ఎంటెర్టైనెర్స్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.అన్ని రకాల పాత్రలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న శర్వా కి రీసెంట్ గా భారీ అంచనాలతో వచ్చిన పడి పడి లేచే మనసు ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది.ఇక ఇప్పుడు సుధీర్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కూడా చాలా మార్పులు చేర్పులు అంటావు ఆగుతూ ఆగుతూ సాగుతుంది.

దీంతో శర్వా కి తెలుగులో కొత్త కథలకి ఉన్న లోటు అర్ధమయింది.అందుకే రీమేక్ సినిమాలపై పడ్డాడు.సుధీర్ వర్మ తరువాత శర్వా చేసే రెండు సినిమాలు కూడా రీమేక్ లే కావడం విశేషం.తనకు శతమానం భవతి లాంటి గ్రాండ్ హిట్ ఇచ్చిన దిల్ రాజు ఎంతో నమ్మి,రీమేక్ రైట్స్ తీసుకున్న 96 రీమేక్ శర్వా లిస్ట్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్.ఈ సినిమా లైట్ హార్టెడ్ లవ్ స్టోరీ కాబట్టి శర్వానంద్ కి పర్ఫెక్ట్. ఇక సమంత ఫీమేల్ లీడ్.సో,ఇద్దరూ టాలెంటెడ్ కాబట్టి తమిళ్ లో వెర్షన్ లో మ్యాజిక్ రీ క్రియేట్ అయిపోతుంది.

అయితే ఆ తరువాత కూడా మరొక రీమేక్ సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వానంద్.ఒక హాలీవుడ్ సినిమాని రైట్స్ తో సహా తీసుకుని మరీ రీమేక్ స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నాడు.ప్రేమమ్ లాంటి క్లాసికల్ రీమేక్ ని బెటర్ గా తీర్చిదిద్దిన చందు మొండేటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడు అని టాక్.తెలుగులో కథల కొరత ఎంత ఉంది అనేది శర్వా తీసుకున్న డెసిషన్స్ చూస్తే అర్ధమవుతుంది.ఇప్పటిదాకా ఎక్ష్ప్రెస్స్ రాజా అనిపించుకున్న శర్వా ఈ రెండు సినిమాలతో హిట్ కొడితే రీమేక్ రాజా పిలిపించుకోవడం ఖాయం.