భారీ ధర పలికిన “మజిలీ” శాటిలైట్ రైట్స్…!

Majili Movie
Majili Movie

పెళ్లి తరువాత మొదటి సారి అక్కినేని నాగ చైతన్య, అక్కినేని సమంతా కలిసి నటిస్తున్న సినిమా “మజిలి”. దీంతో ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో వీళ్ళిద్దరూ భార్య భర్తలుగానే నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. శివ నిర్వాన ఈ సినిమాకి దర్శకుడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ టీవి ఛానల్ అయిన జెమినీ దాదాపు అయిదు కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.దీన్ని బట్టి చూస్తుంటే సినిమా పై బయట డిస్ట్రిబ్యూటర్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయని అర్ధం అవుతుంది. షైన్ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.