అప్పుడు కృష్ణ.. ఇప్పడు కనకదుర్గ

Birthday, Raviteja, Teja, Time Meachine, 2019, Disco Raja, Latest, VI Anand, Dual Role, Ram Talluri, Neelaticket, Payal Rajput, Saba Natesh, Priyanka,

రవితేజ ప్రస్తుతం కెరీర్ లోనే పూర్ ఫార్మ్ లో ఉన్నాడు.కానీ సినిమాలు మాత్రం వరుసగా లైన్ అప్ అవుతూనే ఉన్నాయి.అయితే ఇవన్నీ కూడా ఎదో సెటిల్మెంట్ బాపతు సినిమాలే.ఇప్పడు SRT ఎంటర్టైన్మెంట్స్ లో చేస్తున్న సినిమా డిస్కో రాజా.అయితే అదే బ్యానర్ లో రవితేజ చేసిన నేల టికెట్ అట్టర్ ప్లాప్ అయ్యింది.అందుకే ఆ సినిమాకి వచ్చిన నష్టాలు పూడ్చుకునేలా,రవితేజ తీసుకునే రెమ్యునరేషన్ లో హాఫ్ అమౌంట్ ఇచ్చి ఆ సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఇక ఇప్పుడు కూడా ఇదే టైపు లో మరొక సెటిల్మెంట్ సినిమా తెరకెక్కుతుంది.ఇంతకుముందు మైత్రి మూవీ మేకర్స్ లో రవితేజ చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కూడా డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది.మరో పక్క మైత్రి మూవీస్ వాళ్ళు టాప్ స్టార్స్ అందరితో సినిమా చెయ్యాలి అనే కోరికతో పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ ఇచ్చి,తమిళ్ లో హిట్ అయిన తేరి కథను కొని డైరెక్ట్ చెయ్యమని సంతోష్ శ్రీనివాస్ చేతుల్లో పెట్టారు.

అతను ఆ కథ మీద వర్క్ చేసి ,దాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చే సరికి పవన్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయాడు.దాంతో పవన్ కి ఇచ్చిన అడ్వాన్సులు,కథ మళ్ళీ రీ డిజైన్ చెయ్యడం కోసం పెట్టిన ఖర్చు,డైరెక్టర్ రెమ్యునరేషన్ అన్నీ కలుపుకుని చాలా లెక్క తేలింది.అందుకే ఆ సినిమా పట్టాలెక్కిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.

సినిమా ఎలా ఉన్నా తక్కువ బడ్జెట్ లో లాగించేస్తే డిజిటల్ అండ్ సాటిలైట్ రైట్స్ పరంగా వచ్చేవి అయినా లాభాలుగా మిగులుతాయి అనేది వాళ్ళ ప్లాన్.ఈ సినిమా చేసేస్తే రవితేజ రెండు సినిమాల అగ్రిమెంట్ కూడా పూర్తయిపోతుంది.అందుకే ‘కనకదుర్గ’ పేరుతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా కథకి అసలు ఈ టైటిల్ ఎలా సెట్ అవుతుంది?,ఈ కథకి ఎలాంటి మార్పులు చేశారు అనేది ఆసక్తికరంగా మారింది.మరి విజయవాడ బ్యాక్ డ్రాప్ లో కృష్ణ అనే సినిమా చేసి హిట్ అందుకున్న రవితేజ ఈ సారి ఏకంగా ఆ దుర్గమ్మ పేరే పెట్టుకున్నాడు.మరి ఈ సారి ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.