రెమ్యునరేషన్ తగ్గించుకున్న మాస్ రాజా

Ravi Teja
Ravi Teja

మాస్ మహారాజ …ఈ పేరులో మాస్ ఉన్నా కూడా రవితేజ సినిమాలకు క్లాస్ ఆడియన్స్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే కిక్-2 దెబ్బకి మాత్రం రవితేజ కెరీర్ టర్న్ అయిపొయింది.ఆ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్ అందరికంటే ఎక్కువగా రవితేజాకే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది.అయితే రవితేజ కి ముందు నుండి ఒక అలవాటు ఉంది.

హిట్స్ వచ్చినా లేక ఫ్లాప్స్ ఎదురయినా కూడా తన రెమ్యునరేషన్ మాత్రం తగ్గించుకోడు.అందుకే కిక్-2 తరువాత చాలా గ్యాప్ వచ్చింది.రవితేజ తో MCA సినిమా మొదలుపెట్టి ముహురటం కూడా జరిగాక ఆగిపోవడానికి కారణం కూడా అదే.ఆ కమిట్మెంట్ తోనే మళ్ళీ రాజా ది గ్రేట్ చేసాడు.ఫామ్ లోకి వచ్చాడు.రాజా ది గ్రేట్ ఇచ్చిన ఊపును రవితేజ నిలుపుకోలేకపోయాడు.

వరుసగా నేల టికెట్,టచ్ చేసి చూడు,అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు ఫ్లాప్ అవడంతో రవితేజ క్రేజ్ అండ్ మార్కెట్ రెండూ కూడా పాతాళానికి పడిపోయాయి.అమర్ అక్బర్ ఆంటోనీ కి కూడా పట్టుబట్టి మరీ పడి కోట్లు రెమ్యునరేషన్ అందుకున్న రవితేజ కి ఆ తరువాత మాత్రం ఆ డిమాండ్ లేకుండా పోయింది.దాంతో తనతో నేల టికెట్ సినిమా తీసి దారుణంగా నష్టపోయిన ఆ సినిమా నిర్మాత,తన ఫ్రెండ్ అయిన రామ్ తాళ్లూరి కి మరో సినిమా చేస్తానని ఇచ్చిన మాటని ఇప్పడు నిలబెట్టుకుంటున్నాడు.

రెమ్యునరేషన్ లో రూపాయి కూడా తగ్గించుకోవడానికి ఒప్పుకొని రవితేజ ఇప్పడు మాత్రం కేవలం 5 కోట్లు తీసుకుని డిస్కోరాజా అనే సినిమా చేస్తున్నాడు అనేది ఫిలిం నగర్ టాక్.ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న VI ఆనంద్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.డిస్కోరాజా హిట్ అయితే రవితేజ తన రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తాడు అనే విషయంలో మాత్రం నో డౌట్.