జనసేన పార్టీకి రావెల కిషోర్ బాబు రాజీనామా…!

Ravela Kishore Babu
Ravela Kishore Babu

జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఓ లేఖ పంపిస్తూ, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. మొదట రావెల తెలుగుదేశం పార్టీలో చేరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నిక కాగానే అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న రావెల పార్టీ వర్గాలతో సమన్వయం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గం నుంచి తప్పించారు. దీంతో తెలుగుదేశం పార్టీకి రాజీ నామా చేసిన రావెల ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.అయితే రావెల బిజెపి లో చేరుతున్నట్లు సమాచారం.