గోల్డెన్ ఆఫర్ అందుకున్న రష్మిక

Rashmika Mandhana
Rashmika Mandhana

కిరిక్ పార్టీ సినిమాతో కన్నడలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నకి అక్కడ త్వరగానే స్టార్ డమ్ వచ్చేసింది.ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా హిట్ అందుకున్న రష్మిక టాలీవుడ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది.విజయ్ దేవరకొండ తో కలిసి గీతగోవిందంలో నటించడం ఆమె కెరీర్ ని మలుపు తిప్పింది.తమిళ్ లో కూడా హీరో విజయ్ సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది.కానీ తెలుగులో మాత్రం భీష్మ,డియర్ కామ్రేడ్ సినిమాలతో బిజీ గానే ఉంది.

ఇక ఇప్పుడు రష్మిక ని టాప్ లీగ్ లోకి ప్రోమోట్ చేసే ఒక ఆఫర్ లభించింది.ఈసారి సినిమా అంటూ చేస్తే పక్కాగా హిట్ కొట్టాలని ఒట్టుపెట్టుకుని కూర్చున్న బన్నీ-త్రివిక్రమ్ ల సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్.త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ కి కాస్త వెయిట్ ఉన్న పాత్రలే పడతాయి.ఇక బన్నీతో చేస్తున్న సినిమా లవ్ ఎంటెర్టైనెర్.దీంతో రష్మిక పాత్రకి మంచి స్కోప్ దక్కుతుంది అనడంలో మాత్రం నో డౌట్.

త్రివిక్రమ్ కియారా అద్వానీ ని ప్రిఫర్ చేస్తే బన్నీ మాత్రం రష్మిక ని రికమండ్ చేసాడు.సో,సక్సెస్ ఛార్మ్ అనే ఎక్స్ట్రా ఎడ్జ్ కూడా ఉండడంతో రష్మిక ఫైనల్ అయ్యింది.గీత ఆర్ట్స్ లో గీతగోవిందం సినిమాలో గీత అనే క్యారెక్టర్ చేసిన రష్మిక మళ్ళీ అదే గీత ఆర్ట్స్ ద్వారా స్టార్ హీరోయిన్ గా ప్రోమోట్ అవ్వడం చూస్తే గీత అనే పేరు ఆమెకి ఎంత లక్కీ అనేది అర్ధమవుతుంది.ఇప్పటికి తాను తపించిన ఆఫర్ దక్కడంతో ఫుల్లు ఖుషి గా ఉంది గీత అలియాస్ రష్మిక.