సాయి ధరమ్ తేజ్ కు జోడిగా రష్మిక…!

Rashmika Mandhana
Rashmika Mandhana

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్,దర్శకుడు మారుతీ కాంబినేషన్లో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే మారుతీ ఈ సినిమాలో హీరోయిన్ గా “గీత గోవిందం” ఫేమ్ రష్మిక మందనని తీసుకోనునట్లు తెలుస్తోంది.

టాప్ హీరోయిన్ గా ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న రష్మిక అయితే తన సినిమాకి బాగుంటుందని మారుతీ నమ్ముతున్నాడట. కాగా త్వరలో ఈ సినిమా పై అధికారిక ప్రకటన రానుంది.అయితే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న ‘చిత్రలహరి’ సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు.