అరగంట పాటు అరాచక రాముడి విధ్వంసం

Vinaya Vidheya Rama
Vinaya Vidheya Rama

వినయ విధేయ రామ…ఈ సినిమా ట్రైలర్ చూసాక సినిమాలో ఏ రేంజ్ లో ఫైట్స్ ఉంటాయి అనేది అందరికి అర్ధమయింది.రామ్ చరణ్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని కండలు తిరిగిన దేహంతో,వాళ్లంతా టాటూలతో విలన్స్ ని ఎత్తి గాలిలోకి విసిరేస్తూ మాస్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు.సినిమాకి అతి కీలకమయిన ఫైట్ ఇదే.జనరల్ గా ఫైట్ అంటే అయిదు నిమిషాలో,పది నిమిషాలో ఉంటుంది.కానీ ఈ ఫైట్ మాత్రం ఏకంగా అరగంట పాటు ఉంటుందట.

ఈ మాట సినిమాకి ఎంతయితే పోజిటివిటీ కలిగిస్తుందో అంతే నెగెటివిటీ కూడా క్రియేట్ చేస్తుంది.ఎందుకంటే ఈ రోజుల్లో అంత సేపు ఫైట్ అంటే ఓపిగ్గా కూర్చుని చూసే ఓపిక ఉండటలేదు.బాహుబలి సినిమాలో వార్ ఎపిసోడ్ కే కాస్త లెంగ్త్ ఎక్కువయింది అంటూ కౌంటర్స్ వినిపించాయి.మరి ఇంత సుదీర్ఘంగా సాగే ఈ ఫైట్ ని ఎంతవరకు ఎంజాయ్ చేస్తారు అనేది చూడాలి.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ తో ఓవర్సీస్ ఆడియన్స్ లో చిన్న నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది.

ఇక ఈ అప్డేట్ అక్కడ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.మరి ఈ సినిమాని హిట్ చెయ్యడానికి తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలు వాడుతున్న బోయపాటి ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.