నిన్న ఆకుల తూచ్ . ఇవాళ రామ‌కోట‌య్య బిజేపికి ఝ‌ల‌క్ ..!

RAMAKOTAIAH

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల‌కు ముందే రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ఇప్ప‌టికే ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో వున్న అధికార పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. బిజేపి – తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ నేప‌ధ్యంలో బిజేపి నుంచి నాయ‌కులు వ‌ల‌స‌లు షురూ అయ్యాయి. నిన్న‌టికి నిన్న రాజ‌మండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ బిజేపికి గుడ్ బై చెప్పారు.

అయితే ఈ విష‌యంలో ఆయ‌న తూచ్ అని అన్న‌ప్ప‌టికీ ఎప్ప‌టికైనా గాజు గ్లాస్ (జ‌న‌సేన ) ప‌ట్టుకుంటార‌నేది ఆయ‌న కేడ‌ర్ కామెంట్స్‌.ఇక విశాఖ జిల్లా బీజేపీ సీనియర్ నేత రామకోటయ్య బీజేపీకి ఝలక్ ఇచ్చి టీడీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పంపిన రామకోటయ్య, రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని వ్యాఖ్యానించారు.

బ్రాహ్మణుల సంక్షేమం కోసం పనిచేస్తున్న టీడీపీతో కలిసి పనిచేస్తానని రామకోటయ్య వెల్ల‌డించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రామకోటయ్య రెండు దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నారు.అనేక సంస్థ‌ల‌ పదవులతో పాటు స్వచ్ఛంద సేవలలో సభ్యుడిగా పలు కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వహించారు.ఆంద్ర‌ప్ర‌దేశ్ లో బిజేపి భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్ధ‌కంగా మార‌డంతోనే వీరంతా వ‌ల‌స‌లు బాట‌లు ప‌డుతున్నార‌ని స‌మాచారం .