పూరి బుల్లెట్ పేలుతుందా?

iSmartShankar
iSmartShankar

పూరి జగన్నాథ్…ఈ పేరుకి ఒకప్పడు విపరీతమయిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.హీరో ఎవరయినా కూడా పూరితో సినిమా అంటే మాత్రం మేకోవర్ కంపల్సరీ.ఇక కంటెంట్ కూడా అదే రేంజ్ లో ప్రెసెంట్ చేసేవాడు.అప్పటివరకు ఉన్న సినిమాటిక్ స్టయిల్ ని బ్రేక్ చేసి డైలాగ్స్ నుండి షాట్ డివిజన్ వరకు కొత్త విధానాన్ని ఫాలో అయ్యేవాడు.పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ కూడా అలా వచ్చిందే.ఒక్క మహేష్ కే కాదు అనేకమంది హీరోస్ కి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఘనత పూరి సొంతం.కొత్తదనం అనే పదాన్ని పరిచయం చేసిన పూరి ఆ తరువాత మాత్రం అదే మంత్రాన్ని పాటిస్తూ అప్డేట్ అవ్వడం మర్చిపోయాడు.

దాని ఫలితంగా ఇండస్ట్రీ లో,ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పు గమనించడంతో విఫలమయ్యాడు.అందుకే చాలా కష్టపడి,వర్క్ చేసి తీసిన మెహబూబా కూడా ప్లాప్ గానే నిలిచింది.మళ్ళీ ఇప్పడు రామ్ ని ఒప్పించి ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నాడు.అయితే తన సహజ శైలికి భిన్నంగా నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఈ సినిమా చేయబోతున్నాడట పూరి.ఆ సినిమాకి సంబందించిన మోషన్ పోస్టర్ మొత్తం మామూలుగానే ఉంది.కానీ అందులో చూపించిన డబుల్ సిమ్ కార్డ్ అనేది సినిమా థీమ్.రెండు బుర్రలున్న…అంటే షార్ప్ మైండెడ్ బ్యాడ్ బాయ్ ఎలా ఉంటాడు అనేదాన్ని పూరి తన స్టైల్ లో ప్రెసెంట్ చెయ్యబోతున్నాడు.ఇక టైటిల్ లో కూడా రామ్ పోస్టర్ ని తల్లకిందులుగా వేసి అంచనాలకు భిన్నంగా ఉండే ఒక సినిమా చూడబోతున్నారు అని కన్వే చేసే ప్రయత్నం చేసాడు.

ఈ సిమిమా కథ,పూరి తీత రెండూ కూడా విభిన్నంగా ఉంటేనే ఈ సినిమావరకు పూరి మార్క్ అండ్ మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతాయి.ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా అయిన పూరి ఈ సారి మాత్రం ష్యూర్ హిట్ అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.అయితే ఆ కాన్ఫిడెన్స్ఎంతవరకు నిలబడుతుంది అనేది మే లో తెలుస్తుంది.పూరి తో అసోసియేట్ అయిన ఛార్మి అండ్ సరయిన సాలిడ్ హిట్ కోసం రిస్క్ చేస్తున్న రామ్..ఇలా అందరికి కూడా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అనే టాక్ చాలా ఇంపార్టెంట్.