రేపు రామ్, పూరీ జగనాథ్ ల కొత్త మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్…!

ram,puri jaganath

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో మూవీ రానున్న విషయం తెలిసిందే.అయితే పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. హీరోలను స్టైలిష్ గా చూపిస్తూనే డైనమిక్ రోల్స్ తో వాళ్ళ ఇమేజ్ ను మార్చేస్తుంటారు పూరీ జగన్నాథ్. ఇప్పుడు రామ్ తో కూడా ఇదే చేయబోతున్నారు పూరీ జగన్నాథ్. ఈ సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్ లోకి మారిపోయాడు రామ్.

పూరీ జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్ లో పూరి జగనాథ్,నటి ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రేపు విడుదల చేయనుంది. మే లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.