ఖబడ్డార్ అంటున్న రామ్ గోపాల్ వర్మ…!

ram-gopal-varma
ram-gopal-varma

రామ్‌గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, రెండు పాటలు రిలీజ్ చేసిన ఆర్జీవీ సినిమాపై అంచనాలు పెంచేశాడు. మరోవైపు ట్విట్టర్‌లో రోజుకో ఫొటో పోస్ట్ చేస్తూ సంచలనం రేపుతున్నాడు. అయితే ఈ సినిమాను కచ్చితంగా అడ్డుకుని తీరతామని ఆర్జీవీకి పరకోక్షంగా కొందరు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు.” ఏయ్… లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్‌కు ఎవరైనా అడ్డొస్తే ఖబడ్డార్ ” అంటూ ఆర్జీవీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చేతిలో కత్తిపట్టుకుని ఉన్నట్లున్న ఓ మార్ఫింగ్ ఫొటోను ఆయన పోస్ట్ చేశాడు.