ఏపిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు లైన్…!

Lakshmis NTR
Lakshmis NTR

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. ఈ చిత్రం మార్చిలో ఏపీలో మినహా అన్ని చోట్లా విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను కోర్టు అడ్డుకున్న విషయం తెలిసిందే. కాగా అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకు సిద్ధమైంది.ఏపీలో మే 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.ఈ మేరకు ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఎట్టకేలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మే 1న ఆంధ్రప్రదేశ్ లో విడుదల కానుందని, ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రలను వచ్చి చూడండి అంటూ వర్మ ఆ ట్వీట్ చేసారు.