మొదటి రోజు దూకుడుని కొనసాగించాలేకపోతున్న రామ్ చరణ్ …!

VinayaVidheyaRama
VinayaVidheyaRama

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’.ఈ చిత్రం సంక్రాంతి సీజన్లో భారీ అంచనాల నడుమ విడుదలయింది.మొదటి రోజు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.కానీ ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. అప్పటి నుంచి పెద్దగా రికవర్ కాలేదు. ఇక రెండో వీకెండ్లో ఈ సినిమా షుమారుగా నాలుగు కోట్ల రూపాయలకంటే కాస్త ఎక్కువ షేర్ మాత్రమే వసూలు చేసింది.సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.30 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించాల్సి ఉంది కాబట్టి ఈ రేంజ్ వసూళ్ళు సరిపోవు.

పది రోజులకు గాను ‘వినయ విధేయ రామ’ కలెక్షన్స్ దాదాపుగా రూ. 61 కోట్ల రూపాయల మార్కును టచ్ చేశాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా దాదాపుగా 63 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూ. 60 కోట్ల షేర్ క్లబ్ లో చేరడం గొప్పే కానీ భారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడంతో ఇంకా భారీగా డెఫిసిట్ ఉండిపోయింది.