బాబాయ్ ప‌వ‌న్ కోసం అబ్బాయ్ చ‌ర‌ణ్ ఏం చేశాడో తెలుసా…?

Ram Charan,Pawan Kalyan
Ram Charan,Pawan Kalyan

రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జనసేన పార్టీ ఒక పాటను రూపొందించింది.ఒకడొచ్చాడు.. వచ్చాడు.. జాతిని జాగృతి గొలుప… అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కార్యక్రమాలతో సాగే ఈ పాటను చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్ విడుదల చేశాడు.

తన దృష్టిలో, లక్షలాది అభిమానుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే పాట ఇది అంటూ ఫేస్‌ బుక్‌లో పోస్ట్ పెట్టాడు. దేశం కోసం పోరాడిన హీరోలకు అంకితం చేస్తున్నా.. దీన్ని విని స్ఫూర్తి పొందండి. జై హింద్‌ అని చరణ్‌ ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ పాటకు అటు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచి మంచి స్పందన వస్తోంది.