చరణ్ లెటర్ పై దుమారం

Ram-charan-teja
Ram-charan-teja

వినయ విధేయ రామ రిలీజ్ కి ముందు ఎన్ని అంచనాలు క్రియేట్ చేసిందో,రిలీజ్ అయ్యాక వాటిని ఎలా తల్లకిందులు చేసిందో తెలిసిందే.ఈ సినిమా డిజాస్టర్స్ రన్ ముగిసింది.అంత దారుణమయిన టాక్ వచ్చినా కూడా 62 కోట్ల మేర షేర్ రాబట్టింది.ఓవర్సీస్ లో మాత్రం కొలాప్స్ అయ్యింది.కనీసం హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్ లోకి కూడా ఎంటర్ కాలేకపోయింది.అయితే ఈ సినిమా ఫ్లాప్ అంటూ స్వయంగా ఒప్పుకుంటూ ఒక లెటర్ రిలీజ్ చేసాడు రామ్ చరణ్.

సినిమా హిట్ అయినప్పుడు థాంక్స్ చెబుతూ లెటర్స్ రాసిన వాళ్ళు ఉన్నారు.కానీ ఇలా డిజాస్టర్ సినిమాకి లెటర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం.ఈ లెటర్ లో రాసిన విషయాలు కొన్ని బాగా హైలైట్ అవుతున్నాయి.అసలు దీనికి పర్పస్ ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్.DVV దానయ్యకు ఇంతకుముందు కూడా రామ్ చరణ్ తో బ్రూస్లీ తీస్తే దారుణమయిన దెబ్బ తగిలింది.ఇప్పడు VVR కూడా సేమ్ సీన్ రిపీట్ చేసింది.

ఈ లెటర్ రాసి దానయ్య కి పొగడడం వరకు బాగానే ఉన్నా ఇందులో బోయపాటి పేరు మెన్షన్ చెయ్యకపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది క్వశ్చన్ మార్క్.ఫ్లాప్ కి కారణం బోయపాటి అయినా ఈ సినిమాకి,స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మాత్రం చరణ్ అండ్ చిరంజీవి.అంటే వాళ్ళ జడ్జిమెంట్ స్కిల్స్ పై నెగిటివిటీ రాకుండా ఇలా జాగ్రత్త పడుతున్నారా? అనే ప్రశ్న వినిపిస్తుంది.VVR సినిమా ఇంత ఫ్లాప్

కంటెంట్ తో వస్తున్నపుడు ముందు ఇంటర్వూస్ లో సినిమా గురించి అంత అతిశయోక్త్తి మాటలు చెప్పడం కరెక్టేనా?…అది ప్రేక్షకులను మిస్ లీడ్ చెయ్యడం కాదా? అనే మాట కూడా వినిపిస్తుంది.ఇక సినిమా ప్రివ్యూ చూసుకుని ఈ సినిమా బయటికి వదిలిన రామ్ చరణ్ ఈ ఫ్లాప్ లో తన పాత్ర ఏమీ లేదు అని చేతులు దులుపుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప ఈ లెటర్ కి వేరే పర్పస్ లేదు అనేది సోషల్ మీడియా కామెంట్.

రంగస్థలానికి క్రెడిట్ తీసుకున్న చరణ్ ఈ సినిమాకి మాత్రం ట్రోల్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు.ఇది మీడియా ద్వారా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి మాత్రమే మీడియా కి థాంక్స్ అని మెన్షన్ చేసినట్టున్నాడు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.కామ్ గా ఉంది నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టి చూపించకుండా అనవసరంగా ఎదో చేయబోయి ఇంకేదో చేసాడు చరణ్ అనేది కంక్లూషన్.