VVR పై రామ్ చరణ్ లెటర్

Ram Charan
Ram Charan

రామ్ చరణ్ ఈ మధ్య నటనలోనే కాదు బిహేవియర్ లో కూడా చాలా పరిణితి కనబరుస్తున్నాడు.సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా రిలీజ్ అయ్యింది.60 కోట్ల బడ్జెట్ లో తియ్యాల్సిన ఈ సినిమాకి ఏకంగా 90 కోట్లకు పైగా ఖర్చు పెట్టించాడు బోయపాటి.అయినా కూడా దానయ్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాడు.రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా 94 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

కానీ బోయపాటి వాడిన అవుట్ డేటెడ్ ఫార్ములా,ఎక్సాగరేటెడ్ హీరోయిజం తో సినిమా ఫస్ట్ డే నుండి దారుణమయిన టాక్ తెచ్చుకుంది.అయినా కూడా పండగ సీజన్ కావడంతో దాదాపు 63 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది.నిజానికి ముందు అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీసి ఉంటే సినిమా కొనుక్కున్న వాళ్ళు సేఫ్ అయిపోయేవారు.కానీ ఇప్పడు ఏకంగా 30 కోట్ల నష్టాలతో ఈ సినిమా ఫైనల్ రన్ ముగించింది.దీంతో ఆ సినిమా హీరో అయిన రామ్ చరణ్ ఒక ఓపెన్ లెటర్ రాసాడు.

ఆ లెటర్ లో ఏ ఒక్కరిని విమర్శించకుండా,తన సినిమా అనుకున్న విజయం సాధించలేకపోయింది అని రాసుకొచ్చాడు.అలాగే నిర్మాత దానయ్య సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.ఇక మీడియా వారికి స్పెషల్ థాంక్స్ అంటూ మెన్షన్ చేసి టచ్ చేసాడు.వినయ విధేయ రామ అనే టైటిల్ కి సినిమాలో జస్టిఫికేషన్ లేకపోయినా ఈ లెటర్ తో రియల్ లైఫ్ లో జస్టిఫికేషన్ ఇచ్చాడు రామ్ చరణ్.దీంతో అంతా రామ్ చరణ్ ని ప్రశంసిస్తున్నారు.