రామ్ చరణ్ రేర్ ఫీట్

VinayaVidheyaRama
VinayaVidheyaRama

స్టార్ హీరోస్ లో రామ్ చరణ్ స్థానం వేరు.చిరు నటవారసుడిగా తెరంగేట్రం చేసిన చరణ్ అశేషమైన ఫ్యాన్ బేస్ ని ఆకట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు.రంగస్థలంతో ఇండస్ట్రీ రికార్డ్ సైతం సొంతం చేసుకున్నాడు.దాంతో రామ్ చరణ్ తరువాతి సినిమా VVR పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఆ సినిమా మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.చాలా బ్యాడ్ టాక్ వచ్చినా కూడా వసూళ్లపరంగా మాత్రం అదరగొట్టింది.సెకండ్ డే కే డ్రాప్ అవ్వాల్సిన కలెక్షన్స్ అయిదురోజులపాటు నిలబడ్డాయి అంటే అది చరణ్ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ అండ్ అతని మేకోవర్ కష్టమే.

అదే సినిమా,అదే టాక్ వేరే హీరో సినిమాకి వస్తే 30 కోట్లు కూడా రాబట్టడమే అనేది ట్రేడ్ లెక్క.కానీ రామ్ చరణ్ మాత్రం వాటన్నిటిని అధిగమించి మరీ 50 కోట్లు రాబట్టాడు.డిజాస్టర్ అన్న సినిమాలతో 50 కోట్లు రాబట్టిన ఘనత గతంలో పవన్ కి మాత్రమే సొంతం.ఇప్పడు ఆ క్రెడిట్ చరణ్ కి సైతం దక్కింది.ఈ సినిమా హిట్ అయ్యుంటే మళ్ళీ 100 క్లబ్ లో చేరేవాడు ఈ కొణిదెల కొదమ సింహం.చిరంజీవి ఈ సినిమా ఫైనల్ కట్ చూడకపోవడం కూడా ఈ సినిమా పాలిట శాపంగా మారింది.కొన్ని ఓవర్ ది టాప్ సీన్స్ కట్ చేసుంటే ఈ సినిమా ఖచ్చితంగా మరో 20 కోట్లు ఎక్కువగా కొల్లగొట్టేవాడు.