రాజుగారిగది-3 మొదలవుతుంది

Raju Gari Gadhi 3
Raju Gari Gadhi 3

రాజుగారి గది సినిమా ఓంకార్ కి డైరెక్టర్ గా ఫస్ట్ సక్సెస్ మాత్రమే కాదు నిర్మాతలకు కాసులపంట పండించిన సినిమా.అందుకే ఆ టైటిల్ ని లక్కీ గా ఫీల్ అయిన ఓంకార్ దాన్ని ఒక ఫ్రాంఛైజీగా మార్చాడు.మలయాళీ సూపర్ హిట్ హారర్ సినిమా ‘ప్రేతమ్’ ని రాజుగారి గది-2 అంటూ తెరకెక్కించాడు.కానీ అది అనుకున్నంతగా ఆడలేదు.

నాగార్జున,సమంత లాంటి పెద్ద స్టార్ కాస్ట్ ఉండడం వల్ల పెట్టిన పెట్టుబడి మాత్రమే రాబట్టగలిగింది.అయినా కూడా మళ్ళీ ఆ సినిమాకి కొనసాగింపుగా మరొక సీక్వెల్ రాబోతుంది.రాజుగారిగది-3 సినిమాని హీరోయిన్ సెంట్రిక్ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు ఓంకార్.

అందుకే ఆ సినిమాలో హీరోయిన్ గా తమన్నా ని ఎంచుకున్నాడు.ఆల్రెడీ ఆమెకి స్టోరీ మెయిన్ ప్లాట్ నెర్రెట్ చేసాడని టాక్.అయితే రాజుగారిగది-2 ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ రావడం కష్టమే.అందుకే మళ్ళీ తానే నిర్మాతగా మారే ఆలోచనలో ఉన్నాడట.మరి ఈ దెయ్యం బొమ్మ ఈ సారి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి.