ఈ సంక్రాంతికి తలైవా V/S తల…టెన్షన్…టెన్షన్

peta

తమిళ్ లో ఇప్పటివరకు చాలా సినిమాలు క్లాష్ అయ్యాయి.కానీ ఈ సంక్రాంతికి మాత్రం అక్కడ హిస్టారిక్ ఫైట్ జరగబోతుంది.ఒక పక్క తలైవా రజిని మచ్ అవైటెడ్ మూవీ పెట్టా…మరో పక్క అజిత్ నటించిన విశ్వాసం.రజిని కి తమిళనాడులో ఉన్న ఎవర్ గ్రీన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.ఇక ఇప్పడు వస్తున్న రజిని సినిమాకి మరో అడ్వాంటేజ్ ఉంది.బాషా సినిమా తరువాత మళ్ళీ రజిని ఫుల్ మాస్ ఫార్ములాతో,పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ తో వస్తున్న సినిమా ఇది.ఈ సినిమా మొత్తాన్ని రజిని చరిష్మా వాడుకుని డిజైన్ చేసాడు టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్.
అజిత్…ఈ మధ్య కాలంలో తమిళ్ లో ఏర్పడిన ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్.అతని సాల్ట్ పెప్పర్ లుక్ కి అక్కడ ఉన్న క్రేజీ ఫ్యాన్స్ ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.దాన్ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుని బ్యాక్ టు బ్యాక్ వీరం అండ్ వేదాళం అనే రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు డైరెక్టర్ శివ.మూడో సినిమా కమర్షియల్ గా హిట్టే.అందుకే ఈ సారి అన్ని రకాలుగా విజయం అందుకోవాలని మరీ ఇంకాస్త జాగ్రత్తగా విశ్వాసం సినిమా తీసాడు.అందుకే ఆ సినిమా ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ దక్కింది.ఏకంగా మిలియన్స్ కి పైగా లైక్స్ తెచ్చుకుని ట్రైలర్స్ లో కొత్త చరిత్ర సృష్టించింది.రెండు భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో రెండు సినిమాలు తమిళ నాట ఒకేరోజు విడుదల చెయ్యాలి అనుకున్నారు.
కానీ ఇది అంత మంచి పరిణామం కాదు అని నడిగర్ సంఘం కల్పించుకుని డేట్స్ సర్దుబాటుకు ప్రయత్నించారు.కానీ నో యూజ్.దాంతో ఈ నెల 10 థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం కన్ఫర్మ్.అయితే ఈ రెండు సినిమాల్లో ఏది కాస్త తగ్గినా కూడా క్రిటిసిజం…దాంతో గొడవలు కూడా కన్ఫర్మ్.ఈ సినిమాల రిలీజ్ హీరోల చేతిలో గాని,డైరెక్టర్స్ చేతిలో గాని లేకుండా పోవడంతో ఈ పరిస్థితి వచ్చింది.ఇక ప్రీమియర్స్ కూడా ఉండడంతో ముందురోజు నుండే థియేటర్స్ దగ్గర పోలీసులకు పడిగాపులు తప్పవు.తమిళ నాట జరగబోతున్న ఈ భారీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.