రజనీకాంత్‌ను నెత్తికెక్కించుకుంటున్నారు

MigaMigaAvasaramfilm, Rajinikanth, SreePriyanka, VHouseProductions,

వి హౌస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై సురేష్‌ కామాక్షి నిర్మిస్తున్న చిత్రం ‘మిగ మిగ అవసరం’ మహిళా పోలీసుల కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీప్రియాంక పోలీసు అధికారి గా, హరీష్‌ కుమార్‌ ఓ కీలక పాత్ర పోషించారు. నామ్‌ తమిళర్‌ కట్చి అధ్యక్షుడు సీమాన్‌ పోలీసు ఉన్నతాధికారిగా ఈ సినిమా లో నటించారు. ఈ సినిమా కి సంగీతం ఇషాన్‌ దేవ్‌ సమకూర్చారు. చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌ ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం లో జరిగింది. దర్శక హిమాలయం భారతిరాజా, దర్శకుడు చేరన్, సీనియర్‌ దర్శకుడు భాగ్యరాజ్‌‌, సీమాన్‌, నిర్మాత జేకే రితీష్‌లు ముఖ్య అతిథులుగా పోల్గున్నారు మరియు పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా భారతిరాజా … ‘మిగ మిగ అవసరం’ సినిమాను చూశా. పోలీసు శాఖలోని మహిళల జీవితాన్ని ఇందులో పూర్తిగా చూపించారు.

 

ఈ సినిమాలో శ్రీప్రియాంక చాలా సహజంగా నటించి ఆ పాత్రకు బలాన్ని చేకూర్చారు. చిత్రం చాలా యదార్థంగా ఉంటుంది. తమిళనాట స్థిరపడిన పొరుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నికల్లో 30 శాతం రిజర్వేషన్‌ కావాలని పోరాడతామని చెబుతున్నారు. వారిని చూసిన నాకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అసలు దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి, దక్షిణ భారత నటీనటుల సంఘం పేర్లను తమిళ సినీ వాణిజ్య మండలి, తమిళ సినీ నటీనటుల సంఘంగా మార్చాలన్నమార్పులేదు. దాదాపు 25 ఏళ్లుగా పోరాడుతున్నా. ఆ పేర్లను ఇంకా మార్చలేని స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. అనంతరం సీమాన్‌ మాట్లాడుతూ ‘తలైవర్‌‘ (అధినేత) అనే పదానికి అర్థం తెలియకుండానే ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. రజనీకాంత్‌ను అందరూ ‘తలైవర్‌’ అంటూ నెత్తినెక్కించారు. ఆయన తలైవర్‌ అయితే.. ఎవరు కామరాజర్‌ ?.. అని అడిగారు. ప్రభాకరన్‌ ఎవరు.. వాళ్లంతా దేశ ద్రోహులా మరి..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.