రజిని అండ్ రాజమౌళి…మిషన్ ఇంపాజిబుల్

rajini,rajamouli

అసలు సినిమాలు మానేస్తా అని ఎప్పుడో ప్రకటించిన రజిని ఈ మధ్య మరింత దూకుడుగా సినిమాలు చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు.పైగా ఒకే డైరెక్టర్ తో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.ఆల్రెడీ కబాలి ఫ్లాప్ అయిన ఆకూడా మళ్ళీ పా రంజిత్ తో కాలా సినిమా చేసి తెలుగులో తన మార్కెట్ తానే తగ్గించుకున్నాడు.శివాజీ,రోబో ల తరువాత శంకర్ తో మూడో సినిమా చేసాడు.ఇక ఇప్పడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసిన రజిని నెక్స్ట్ సినిమా మురుగదాస్ తో కమిట్ అయ్యాడు.మురుగదాస్ తో సినిమా రజిని పొలిటికల్ ఎంట్రీ కి ఉపయోగపడేలా ఉండబోతుంది.

అయితే ఆ సినిమా తరువాత కార్తీక్ సుబ్బరాజ్ తో మరొక సినిమా చెయ్యబోతున్నాడు.ఇక్కడి వరకు ఇది అఫిషియల్ లిస్ట్.కానీ ఆ సినిమా తరువాత రజిని రాజమౌళి తో సినిమా చెయ్యబోతున్నాడు అనే టాక్ కూడా ఎక్కువగా వినిపించింది.గతంలో రాజమౌళి సినిమాలో నటించాలని ఉంది అని రజిని కామెంట్స్ చెయ్యడంతో ఈ గాసిప్ నిజం అని నమ్మేసే సిట్యుయేషన్ ఏర్పడింది. రజిని-రాజమౌళి అభిమానులు కూడా ఈ స్టన్నింగ్ కాంబినేషన్ నిజం అవ్వాలని కోరుకున్నారు.కానీ అది మాత్రం ఖచ్చితంగా గాలి కబురే.మురుగదాస్ సినిమా తరువాత కార్తీక్ సుబ్బరాజ్ సినిమా కూడా చాలా త్వరగా ఫినిష్ చేసి తన పొలిటికల్ జర్నీలో బిజీగా ఉంటారు రజిని.

అలాంటి టైం లో రాజమౌళి తో సినిమా అంటే పూర్తి సమయం దానికే కేటాయించాల్సి ఉంటుంది.అది కుదరని పని.ఇక RRR లో కీలకమయిన సన్నివేశాల షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు.అసలు RRR సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది అనే విషయం పై ఎవ్వరికి క్లారిటీ లేదు.పైగా ఆ సినిమా పూర్తవ్వగానే జక్కన్న మహేష్ సినిమా పై కూర్చుంటాడు.సో,ఇద్దరికీ ఇలా లాంగ్ అండ్ బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి.సో,ఎలా చూసుకున్నా కూడా ఈ కాంబినేష్ ఊహల్లో తప్ప రియాలిటీ లో మెటీరియలైజ్ కావడం అనేది అసంభవం.