కల్కి కి భారీ డిమాండ్

Hero Rajasekhar,Kalki
Hero Rajasekhar,Kalki

గరుడవేగ సినిమాతో హిట్ కొట్టిన తరువాత రాజశేఖర్ మొదలుపెట్టిన సినిమా కల్కి.యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న కల్కి లో రాజశేఖర్ మళ్ళీ యాంగ్రీ యంగ్ మ్యాన్ అవతారంలోనే కనిపిస్తున్నాడు.లుక్ పరంగా కూడా చాలా బ్రైట్ గా,యాక్టివ్ గా ఉన్నాడు.అందుకే కల్కి పై ముందు నుండే మంచి ఏర్పడ్డాయి.కానీ ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తరువాతే బిజినెస్ పరంగా కదలిక మొదలయింది.గరుడవేగ బడ్జెట్ అదుపుతప్పడంతో కల్కి సినిమాని చాలా టైట్ బడ్జెట్ లో తెరకెక్కించారు.దాంతో ప్రముఖ నిర్మాత KK రాధామోహన్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ అమౌంట్ ఇచ్చి మరీ కొనుక్కున్నారు.దీంతో సాటిలైట్ హక్కుల కోసం డిమాండ్ మొదలయ్యింది.ఇక డిజిటల్ రైట్స్ ఎటూ ఉన్నాయి.అలా సినిమా రిలీజ్ కి ముందే నిర్మాతలయిన కళ్యాణ్ అండ్ జీవిత రాజశేఖర్ లాభాలు అందుకుంటున్నారు.మొత్తానికి గరుడవేగ తో నేర్పిన పాటలు ఇక్కడ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టాయి.