రాజంపేట రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రం – గూడు మారుతోన్న ఎమ్మేల్యే మేడా

Meda-Mallikarjun-Reddy
Meda-Mallikarjun-Reddy

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌లో వ‌ల‌స‌లు షురూ అయ్యాయి. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూసి టిక్కెట్ రాలేద‌ని భంగ‌ప‌డే కంటే అధినేత‌ల హామీల‌తో జంపింగ్ ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు నాయ‌కులు. పార్టీల కండువాలు మార్చేస్తూ పాత గూటిపై విమ‌ర్శ‌న అస్త్రాలు సంధిస్తున్నారు. మొన్న ఆకుల , నిన్న వంగా, తాజాగా మేడా ఇలా వేర్వేరు పార్టీల‌లోకి క్యూ క‌ట్టేస్తున్నారు. ఈ సంద‌డి ఏపిలో ఇప్ప‌ట్లో ఆగేలా లేదు.

రాజంపేట సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి పార్టీ మారతారని ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. ఈ నేపధ్యంలో రాజంపేట టిడిపి పంచాయ‌తీ పార్టీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరింది. మేడా దాగుడుమూతల‌కు చెక్ పెడుతూ సస్పెండ్ చేసి వేటు వేశారు.దీంతో రూట్ క్లియ‌ర్ అయిన మేడా, హైదరాబాద్ లో వైసీపీ అధినేత జగన్ నివాసంలో ఆయనను కలిశారు.అనంతరం మీడియాతో మాట్లాడిన మేడా గంజాయి వనం నుండి తులసి వనంలోకి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. వైఎస్ ఆశయాలతోనే రాజకీయాలలోకి వచ్చానన్న మేడా ప్రజలకు సేవ చేయాలి.

రాజంపేటను అభివృద్ధి చేయాలనే రాజకీయాలలో ఉన్నానన్నారు. చంద్రబాబు దోపిడీని చూడలేకనే పార్టీని వీడానన్న మేడా, నిరుద్యోగ భృతి, కాపు రిజర్వేషన్లు వంటివాటితో ప్రజలను మోసం చేశారన్నారు.ఇటు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి పార్టీ మారడంపై మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు. టీడీపీ నుంచి వైసీపీకి రావడం..గంజాయి వనం నుంచి తులసి వనంలోకి వచ్చినట్టు ఉందంటూ మేడా చేసిన వ్యాఖ్యలకు ఆదినారాయణ కౌంటర్ ఇచ్చారు. తండ్రికి టీటీడీ పదవి తీసుకున్నప్పుడు,మేడాకు గంజాయి వనం గుర్తుకు రాలేదా అంటూ ఆయన ప్రశ్నించారు.లోటస్‌పాండ్ తులసీవనమా అంటూ ..మేడాకు మతిభ్రమించింద‌ని
విమర్శించారు.