9 న తెలంగాణకు రాహుల్ రాక

Rahul Gandhi
Rahul Gandhi

అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి మళ్ళీ తెలంగాణకు రానున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈనెల 9న రాహుల్ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. శంషాబాద్ లోని క్లాసిక్ కన్వేన్షన్ సెంటర్ పక్కనున్న మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ముందుగా చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్లో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు భావించారు.

అయితే అక్కడ సభ నిర్వహించేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో సభా ప్రాంగణాన్ని శంషాబాద్ కు మార్చారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం వస్తోన్న రాహుల్ కు తెలంగాణలో ఇది తొలి సభ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.