మోదీ టార్గెట్ గా మ‌రో బాంబు పేల్చిన రాహుల్

Rahul_Gandhi
Rahul_Gandhi

ప్రధాని మోదీ లక్ష్యంగా మ‌రోసారి విమర్శలు సంధించారు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. అనిల్‌ అంబానీకి మేలు చేసేందుకు మోడీ.. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ను అమ్మేశారని ఆరోపించారు. అనిల్‌ అంబానీకి 30 వేల కోట్ల రూపాయ‌లు లాభం చేకూర్చేందుకు దేశంలోని యువత అవకాశాలను మోదీ దోచుకున్నారని మండిపడ్డారు.

యూత్‌ కాంగ్రెస్‌ పబ్లిక్‌ అవుట్‌ రీచ్‌ ప్రచారంలో భాగంగా యువ క్రాంతి యాత్ర సభలో ప్రసంగించిన రాహుల్‌… అనిల్‌ అంబానీ కోసం మోడీ యువత అవకాశాలను దోచుకున్నారన్నారు. మోదీ రాఫెల్‌ ఒప్పందం కోసం భారతీయ వాయుసేనను మోడీ అమ్మశారంటూ ధ్వ‌జ‌మెత్తారు. రాఫెల్‌ ఒప్పందంలో మార్పులు చేసేటప్పుడు మోడీ రక్షణమంత్రిని కూడా సంప్రదించలేదని నాటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ చెప్పారని అన్నారు.