న‌వ‌భార‌తం కోసం రాహుల్ హామీ ఏమిటో తెలుసా…?

Rahul_Gandhi
Rahul_Gandhi

దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల ఫీవ‌ర్ రాజుకొంటోంది.పార్లమెంట్ ఎన్నికలే ల‌క్ష్యంగా అన్ని పార్టీలు అస్థ్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ నేప‌ధ్యంలో బీజేపీ ఇప్పటికే రైతుల కోసం పథకాల అన్వేషిస్తోంది కాంగ్రెస్ పార్టీ కొత్తగా పథకాలను ప్రకటిస్తుంది. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్ర‌తి పేద‌కు క‌నీస వేత‌నం వ‌చ్చేలా చూస్తామ‌ని హామీ ఇచ్చారు.

ప్రతినెలా పేదవ్యక్తి బ్యాంకు అకౌంట్లోకే నగదు జమ చేస్తామన్నారు. చ‌త్తీస్‌ఘ‌డ్‌లో ప‌ర్య‌టించిన ఆయ‌న పేదలకు ఈ కీలక హామీని ఇచ్చారు .లక్షలాది మంది సోదర, సోదరీమణులు పేదరికంతో, ఆకలితో బాధపడుతూ ఉంటే… మనం నవ భారతాన్ని నిర్మించలేమని ఆయన చెప్పారు . ఈ నేపథ్యంలో ప్రతి పేదవాడికి కనీస ఆదాయ హామీని ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు.