ప్రత్యేక హోదా భరోసా యాత్రకు రాహుల్‌

Priyanka Gandhi
Priyanka Gandhi

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్రత్యేక హోదా భరోసా యాత్రను మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభం కానుంది. మడకశిర నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రత్యేక హోదా భరోసా యాత్ర పోస్టర్లను అనంతపురం జిల్లా మడకశిరలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవిష్కరించారు.

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని ప్రజలలో భరోసా నింపేందేకే ఈ యాత్ర చేప‌డుతున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. ఈ నేప‌ధ్యంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 27న రాజ‌మంగ్రి లో జ‌రిగే యాత్ర‌కు హాజ‌ర‌వుతున్నార‌న్నారు ఆయ‌న‌.