ఎన్నిక‌ల వేళ రాహుల్ పెళ్లి ముచ్చ‌ట..!

Rahul Gandhi
Rahul Gandhi

ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ త‌న పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఆయన విద్యార్ధులతో ముచ్చటించారు. బాలీవుడ్ లో సైతం బయోపిక్‌లు సంద‌డి చేస్తోన్న నేప‌ధ్యంలో తన బయోపిక్‌లో హీరోయిన్ ఎవరంటూ విద్యార్ధులు అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్‌ అధ్య‌క్షులు రాహుల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను పనినే ప్రేమిస్తానని, పెళ్లి కూడా దాంతోనేనని న‌వ్వుతూ సెటైర్ వేశారు. దీంతో విద్యార్దులు కూడా ఆయ‌న స‌మాధానాన్ని బాగా ఎంజాయ్ చేశారు.