కార్య‌క‌ర్త‌ల‌కు మనోధైర్యాన్ని క‌ల్పిస్తూ రాహుల్ ట్వీట్

Rahul Gandhi
Rahul Gandhi

ఎన్నికల కౌంటింగ్ ముందు కార్య‌క‌ర్త‌లు సమన్వయం కోల్పోకుండా ఉండాలన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశంలోని ఏ కార్యకర్తా కష్టం వృధా కాదన్నారు ఆయ‌న‌. ఎగ్జిట్ పోల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని, అవి తప్పుడు సర్వేలని ఆయ‌న కొట్టిపారేశారు. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ భయపడవద్దని కార్యకర్తలకు మనోధైర్యాన్ని కలిగించారు. మరొక్క రోజు కౌంటింగ్ ఉందనగా కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేశారు.