మోదీపై మ‌రోసారి మండిప‌డిన రాహుల్

Rahul_Gandhi
Rahul_Gandhi

కాగ్ రిపోర్టు చౌకీదార్ ఆడిట్ రిపోర్టుగా మారిందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ . ప్ర‌ధాని నరేంద్ర మోదీపై ఆయ‌న మరోసారి విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… దేశ భద్రతను ప్రధాని పణంగా పెడుతున్నారన్నారు. దేశ రక్షణ వ్యవహారాల్లో ప్రధాని మోడీ రాజీపడ్డారన్నారు. రహస్యంగా ఉంచాల్సిన అంశాన్ని ఇతరులకు చేరేలా వ్యవహరించారన్నారు. రూ. 30 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగ మయిందన్నారు రాహుల్ .

రాఫెల్ డీల్ గురించి రక్షణ మంత్రికి, రక్షణ శాఖకు కూడా తెలియదని… కేవలం మోదీకి, అనిల్ అంబానీకి మాత్రమే తెలుసని అన్నారు ఆయ‌న . ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రశ్నార్థకంగా మిగిలిపోయాయని అన్నారు. ఈ అంశంలో అవినీతి, డీల్ జరిగిన తీరు, దేశ భద్రతలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు రాహుల్ . తప్పు చేసిన ఏ ఒక్కరినీ క్షమించరాదన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు.