అమేధిలో రాహుల్‌ నామినేషన్‌

Rahul Gandhi
Rahul Gandhi

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేథి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు . ఇవాళ ఆయన తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. రాహుల్‌ తల్లి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్‌ వాద్రాలు వెంట రాగా రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌ వేసే ముందు రాహుల్‌ మున్షిగంజ్‌-దరిపూర్‌ మీదుగా గౌరిగంజ్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీల కుటుంబానికి కంచుకోట అమేధిలో రాహుల్‌ ఇప్పటికి మూడుసార్లు గెలుపొందారు. మరోవైపు అమేధితో పాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీచేస్తున్న రాహుల్‌… ఇప్పటికే అక్కడ నామినేషన్‌ దాఖలు చేశారు. అమేధిలో రాహుల్‌ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో తలపడుతున్నారు. అయితే గత ఎన్నికల్లోనూ రాహుల్‌ పై స్మృతి ఇరానీ పోటీ చేసి ఓడిపోయారు.