మోదీ తిట్టినప్పుడల్లా హత్తు కోవాలనిపిస్తోంది – రాహుల్

Rahul Gandhi
Rahul Gandhi

ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలకు మ‌రోసారి కొత్త ర‌కంగా ప‌దును పెట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఒడిశా టూర్ లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మనిషిగా, ఒక రాజకీయ నాయకుడిగా త‌న‌కు జరిగిన మంచి ఏంటంటే.. బీజేపీ, ఆరెస్సెస్ నుంచి తిట్లు తినడమేన‌న్నారు. వాళ్లు త‌న‌కిచ్చిన అతి పెద్ద బహుమతి అదేన‌న్నారు. మోదీ త‌న‌ను తిట్టినప్పుడల్లా ఆయనను హత్తుకోవాలని అనిపిస్తుంద‌న్నారు. ఆయన నాతో విభేదిస్తారు.

నేను ఆయనతో విభేదిస్తాన‌ని, కానీ తాను పోరాడతాన‌ని.. . ఆయనను ప్రధాని పదవి నుంచి దించడమే త‌న లక్ష్య‌మ‌న్నారు రాహ‌ల‌్ . అంతే తప్ప ఆయనను ద్వేషించడం కాదు అని రాహుల్ అన్నారు. మేం ప్రజలు చెప్పింది వింటాం. మోదీలాగా కాదు. ఆయన తనకు అంతా తెలుసు అనుకుంటారు. ఎవరినీ పట్టించుకోరు. అదే మాకూ, బీజేపీకి ఉన్న తేడా అని రాహుల్ స్పష్టం చేశారు.