ప్రత్యేక హోదాపై రఘువీరా శపథం ఏమిటో తెలుసా…?

Raghuveera Reddy
Raghuveera Reddy

ప్రత్యేక హోదా అంశం ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌లో సంజీవినిలా మారింది. తెలుగు రాష్ట్రాన్ని విభ‌జించి ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి ఈ ఎన్నిక‌ల్లో జ‌వ‌స‌త్వాలు పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌ధ్యంలోనే కాంగ్రెస్ వార్ రూమ్ భేటీకి హాజ‌రై తిరిగి వ‌చ్చిన ఏపీసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రత్యేక హోదాపై శపథం చేశారు. రాహుల్ ప్రధాని అయ్యాక ప్రత్యేక హోదా వస్తేనే, మళ్ళీ ఏపీలో అడుగుపెడతానని, లేదంటే ఏపీలో అడుగుపెట్టానని శపథం చేశారు.

అనంతపురంలో మీడియాతో మాట్లాడిన రఘువీరా… ఏపీకి ప్రత్యేక హోదా అమలుచేసి తీరుతామని, దీని ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఒకవేళ అమలు చేయలేక పోతే త‌న‌ జీవితంలో శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టనని శపథం చేశారు ర‌ఘువీరా. త‌న ఇల్లు, ఆస్తులు,అన్నీ ఇక్కడే ఉన్నాయ‌ని, 62 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్నాన‌నీ, కానీ రాహుల్ ప్రధానిగా ప్రత్యేకహోదా రాకపోతే అన్నీ వదిలేస్తానని ప్ర‌తిన‌బూనారు. మొత్తానికి ఏపి కాంగ్రెస్ ఎన్నిక‌ల స‌మ‌రోత్సాహానికి తెరదీసింది.