కాగ్ రిపోర్ట్ పై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు

Rafal Deal
Rafal Deal

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కాగ్ లెక్కలను కూడా తారుమారుచేశారన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్. దిల్లీలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియా సమావేశంలో మాట్లాడారు. కాగ్ రిపోర్ట్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అసలు ఒప్పందానికి.. మోడీ కుదుర్చుకున్న దానికి చాలా తేడా ఉందని రక్షణ కార్యదర్శి నోట్ ను కాగ్ రిపోర్టులో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

రాఫెల్ ఒప్పందంలో అవకతవకలు జరగకపోతే జేపీసీ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని నిల‌దీశారు. అనిల్ అంబానీకి దోచిపెట్టేందుకే రాఫెల్ ఒప్పందం చేసుకున్నారన్నారు. కొత్త ఒప్పందం వలన తక్కువ ధరకే విమానాలు వస్తున్నాయని ప్రధాని, ఆర్ధిక, రక్షణశాఖ మంత్రులు అంటున్నారని, అసలు ఒప్పందం జేపీసీ విచారణ జరిపిస్తే మేలే జరుగుతుంది కదా అన్నారు.