లోక్ స‌భ చివ‌రి రోజు మోదీ ఏం మాట్లాడారో తెలుసా

PM Narendra Modi
PM Narendra Modi

బ్లాక్‌ మనీ, అవినీతికి వ్యతిరేకంగా చట్టాలు చేసిన ఘనత తమదేనన్నారు ప్రధాని మోదీ. చివరిరోజు సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ కొందరు నేతలు సభలో భూకంపం తెస్తామన్నారు. కానీ ఏదీ రాలేదన్నారు . భూకంపాన్ని తట్టుకొని సభ ఔన్నత్యం పెంపొందింద‌న్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనినీతిపై పోరాటం చేశామన్నారు.

జీఎస్టీ బిల్లుతో ఆర్థిక రంగం రూపురేఖలు మార్చామని, తమ పాలనలో అన్నివర్గాలకు సామాజిక న్యాయం చేశామన్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయన్నారు. సభలో మొత్తం 203 బిల్లు ఆమోదం పొందాయని.. ఓబీసీల రిజర్వేషన్ కోసం కమీషన్ వేశామని, భవిష్యత్ లో మరిన్ని ఉన్నతమైన కార్యక్రమాలు చేపడతామన్నారు ప్ర‌ధాని.