పూరి పనిలో దిగితే అంతే…!

Hero Ram

పూరి సినిమాల్లో హీరోలే కాదు పూరి కూడా చాలా హైపర్.పనిలో దిగితే అంతే..నాన్చుడు ఉండదు…దంచుడే.ఇప్పడు కూడా అంతే రామ్ తో సినిమా అని అనౌన్స్ చేసి నాలుగు రోజులయింది.జనవరిలో సినిమా షూటింగ్ అండ్ మే లో లో రిలీజ్ అని క్లారిటీ ఇచ్చేసారు.అయితే ఈ రోజు నాలుగు గంటలకు సినిమా నుండి అప్డేట్ అంటున్నారు.అయితే అది ఈ సినిమాలో నటించే కాస్ట్ అండ్ క్రూ గురించి అయ్యుండొచ్చు.

అయితే అది సినిమా థీమ్ ని తెలిపే పోస్టర్ అని కూడా టాక్ వినిపిస్తుంది.మిగతా వాళ్ళ విషయంలో అది నిజమే అనుకోవచ్చు.కానీ పూరి విషయంలో దేన్నీ రూమర్ అనుకోలేం.ఇక ఈ సినిమాలో ఛార్మి కూడా కీ రోల్ పోషిస్తుంది.కానీ ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ మాత్రమే.మరి ఈ సారయినా పూరి తన పూర్తి సత్తా చాటేలా ఒక భారీ బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి.