హిట్ కోసం సర్వ శక్తులు కూడదీసుకుంటున్నపూరి

puri jaganath

పూరి…ఒకప్పడు డాషింగ్ డైరెక్టర్ గా టాప్ ప్లేస్ లో ఉండి బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈయనకి ఇప్పుడు మాత్రం టూ బ్యాడ్ టైం నడుస్తుంది.ఒక్కటంటే ఒక్క సినిమా కూడా యావరేజ్ మార్క్ కూడా అందుకోలేకపోతుంది.అందుకే తన పంథా ని పూర్తిగా మార్చుకుని తీసిన మెహబూబా కూడా ఆర్ధికంగా కూడా నష్టాలు మిగిల్చింది.దాంతో అందరి హీరోలను అప్రోచ్ అయ్యి తన దగ్గర ఉన్న అన్ని లైన్స్ చెప్పినా ఉపయోగం లేకపోయింది.విజయ్ దేవరకొండ తో సినిమా కోసం చాలా లిటరల్ గా ట్రై చేసాడు.అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు.కానీ ఖాళీగా ఉండడం అంటే పూరి కి చిరాకు.

అందుకే కాస్త వెయిట్ ఉన్న స్టోరీ తయారుచేసుకుని రామ్ ని ఒప్పించుకున్నాడు.అయితే ఇప్పడు మిగతా టెక్నీషియన్స్ ని సెలక్ట్ చేసుకుంటున్నాడు.తనకి గతంలో పోకిరి లాంటి హిట్స్ ఇచ్చిన మణిశర్మ ని మళ్ళీ ఈ కొత్త సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు.ఇస్మార్ట్ శంకర్ మోషన్ పోస్టర్ లో ఆర్.ఆర్ బావుండడంతో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.దాంతో ఈ సినిమా కి మణిశర్మ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.

ఈ మధ్య మణిశర్మ కి కూడా చెప్పుకోదగ్గ హిట్స్ లేవు.సో,ఈ సారి ఈ ఇద్దరి కాంబినేషన్ కచ్చితంగా వర్క్ అవుట్ అయ్యి హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.సో,పోకిరి టైం లో ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి ఉంది.సో,ఈ ఇద్దరూ కలిసి అదే సెంటిమెంట్ ని మళ్ళీ రీ క్రియేట్ చెయ్యగలుగుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.