పుల్వామా ఉగ్రదాడిలో కీల‌క‌ సూత్రధారి హ‌తం

Abdul Rasheed Ghazi
Abdul Rasheed Ghazi

పుల్వామా ఉగ్రదాడిలో కీలక సూత్రధారి, జైషే మహ్మద్ కమాండర్ అబ్దుల్ రషీద్‌ ఘాజీ అలియాస్ కమ్రాన్‌ను మట్టు బెట్టాయి భారత భద్రతా దళాలు. ఉగ్ర‌దాడిపై ర‌గిలిపోతున్న భార‌త్ జ‌వాన్ లు ప్ర‌తీకారం తీర్చుకున్నారు. పుల్వామా జిల్లాలోని పింగ్లాన్‌ వద్ద జరుగుతున్న ఎన్ కౌంట‌ర్ ప్రాంతంలో వీరిని సైన్యం కాల్చి చంపింది.

ఉగ్రవాదులు, సైనికుల మధ్య ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అయితే ఘటనలో ఆర్మీ మేజర్‌, ముగ్గురు జవాన్లు, ఒక పౌరుడు మృతి చెందారు. సంఘటనాస్థలిని భద్రతా దళాలు పూర్తిగా అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఉగ్రవాదుల ఏరివేత కోసం ప్రస్తుతం పుల్వామాలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ ప్రశంసలు కురిపించారు. భారత సైనికులకు నిండైన ఆత్మస్థైర్యం ఉంద‌న్న ఆయ‌న తీవ్రవాదులను నిలువరించడంలో వారు విజయవంతంగా దూసుకెళ్తున్నార‌న్నారు. పుల్వామా దాడిలో వారం రోజుల్లోగానే ప్రతికారం తీర్చుకున్న భద్రతా దళాలపై సర్వత్రా ప్రశంసలు వ‌స్తున్నాయి.