అమిత్‌ షాపై దాడికి నిరసనలు

Amit Shah
Amit Shah

ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాపై జరిగిన దాడికి నిరసనగా దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు. అమిత్‌ షాపై రాళ్ల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ . మమత బెనర్జీ హింస ద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారని, దేశంలో ప్రజాస్వామ్యాం ఉందా అనిపిస్తోందని ఆయ‌న అసహనం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోని, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగానే రాష్ట్రాలు వారి జాగీరుగా భావిస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాంలో ఇది మంచి పరిణామం కాదన్నారు.