బీజేపీపై నిప్పులు చెరిగిన ప్రియాంక

Priyanka Gandhi Vadra
Priyanka Gandhi Vadra

దొంగను దేశ సరిహద్దులు దాటించిందెవరు అంటూ పరోక్షంగా బీజేపీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ . ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొన్న ప్రియాంక.. బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. నీరవ్ మోదీని దేశం దాటించింది ఎవర‌ని ఆమె ప్ర‌శ్నించారు. మెహూల్ చోక్సి, లలిత్ మోదీ, విజయ్ మాల్యాలను చౌకీదార్ ఎందుకు పట్టుకోలేదన్నారు ఆమె. ఎన్నికల కోసమే నీరవ్‌ను పట్టుకున్నారన్నా ప్రియాంక , వాస్తవానికి వారంతా నరేంద్రమోదీ మిత్రులేనని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.