ల‌క్నోలో ప్రియాంక‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌ధం

Priyanka Gandhi
Priyanka Gandhi

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాజకీయ ప్రయాణాన్ని లక్నోలో ఆరంభించారు. అశేష అభిమాన జన సందోహం మధ్య కాంగ్రెస్‌ అధ్యక్షుడు, తన అన్న రాహుల్‌ గాంధీ, యూపీ పశ్చిమ ప్రాంత పార్టీ ఇన్‌–చార్జ్‌ జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఢిల్లీ నుంచి ఆమె లక్నో చేరుకున్నారు. వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రియాంకకు బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి లక్నోలోని పార్టీ కార్యాలయం వరకు రాహుల్, ప్రియాంక, సింధియాలు కలిసి 25 కి.మీ.పాటు రోడ్‌ షో నిర్వహించారు. వీరి వాహనాలకు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. ప్రియాంకను దుర్గామాత అవతారంతో పోలుస్తూ కార్యకర్తలు లక్నోలో పోస్టర్లు అంటించారు.

సింహంపై దుర్గామాత అవతారంలో ప్రియాంక కూర్చున్నట్లుగా వీటిని తయారుచేశారు. దుర్గామాత రూపంలో సోదరి ప్రియాంక అనే క్యాప్షన్ పెట్టి పెద్దసంఖ్యలో ఏర్పాటు చేశారు. కొత్త రకం రాజకీయాలు చేద్దాం. ఇంతటి అభిమానం చూపుతున్న మీకందరికీ ధన్యవాదాలు అంటూ ప్రియాంక తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.